KMR: బిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ తై బజార్ నిర్వహణకు నేడు వేలంపాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ తుడుం పద్మస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు గ్రామ సచివాలయానికి ఎలాంటి పన్నులు బకాయి ఉండకూడదని స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు రూ.2,000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని వివరించారు.