KKD: ఫిబ్రవరి 28న సామర్లకోట(మం) వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బుధవారం రానుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. విచారణ కమిటీ వేట్లపాలెంలో ప్రమాద ఘటనను పరిశీలించి సమాచారం సేకరిస్తారు.