»Gangstars The Original Gangsters In Mumbai Harbour
Gangstars: ముంబై హార్బర్లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్!
ముంబై హార్బర్ ప్రాంతంలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌ని చూసి పవన ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఎక్కుతోంది. పవన్‌ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడో.. ఇప్పటికే గ్లింప్స్‌తో చెప్పేసిన సుజీత్.. లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Gangstars: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఓ డై హార్డ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజి మూవీతో చూపించబోతున్నాడు సుజీత్. సాహో మూవీ తర్వాత పవన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు సుజీత్. మామూలుగానే సుజీత్‌కు డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన ఫేవరేట్ ఎలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ.. ఓజి గ్లింప్స్ రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు గూస్ మాస్ ఫీస్ట్ ఇచ్చాడు. దీంతో ఓజి థియేటర్లోకి రావడమే లేట్.. ఓ రేంజ్లో రికార్డులు లేస్తాయని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి పవన్ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో సాలిడ్ రిప్లే ఇస్తు మంచి కిక్ ఇస్తోంది నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఊహించకుండానే అప్డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్‌గానే ఓజి మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా షేక్ అయిపోంది. ఇక ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లో ఉంది ఓజి. లేటెస్ట్గా సుజీత్ పవన్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ డీపీని పవన్‌తో కలిసి దిగిన ఫొటోను సెట్ చేసుకున్నాడు.
ఇందులో పవర్ స్టార్.. సుజీత్ భుజం మీద చేయి వేసి ఉండగా.. సుజీత్ క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడు. కాకపోతే ఈ ఫొటోలో ఇద్దరు బ్యాక్ సైడ్ తిరిగి ఉన్నారు. ఈ ఫోటో బాంబే హార్బర్ ఏరియాలో ఓజి షూటింగ్ జరిగినప్పుడు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ముంబై హార్బర్లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఎలాంటి ఊచకోత తెలియాలంటే.. సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.