NLR: సంగం మండలంలో బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, ఇతర రకాల పెన్షన్లను అందించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఏమన్నా సమస్యలు ఉంటే మంత్రికి విన్నవించుకోవచ్చని అధికారులు తెలిపారు.