BHNG: విద్యార్థులు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని అలవరచుకుని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, NCC అధికారి దూడల వెంకటేష్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం జడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 2026-27 సంవత్సరానికి పదో NCC వరంగల్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆర్మీవింగ్ ఎంపికలను నిర్వహించారు.