మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బీజేపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మార్కాపురం పలకను ఆమెకు అందజేశారు. అనంతరం జిల్లాలోని సమస్యలను కలెక్టర్కు వివరించారు. అవి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనాల సరోజినీ, బొంతల కృష్ణ, జీవీ రెడ్డి పాల్గొన్నారు.