»Kavitha Congress Is Only A Name Changer Not A Game Changer
Kavitha: కాంగ్రెస్ నేమ్ ఛేంజర్ మాత్రమే.. గేమ్ ఛేంజర్ కాదు
తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి కేటాయింపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Kavitha: తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పూర్తి కేటాయింపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. శాసనమండలిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మాట్లాడారు. రానున్న ఐదేండ్ల ప్రణాళికకు సంబంధించి బడ్జెట్ లేదన్నారు. ఎన్నికల హామీ గురించి బడ్జెట్లో చెప్పలేదని అడిగారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు.
పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నేమ్ ఛేంజర్ మాత్రమేనని.. గేమ్ ఛేంజర్ కాదని కవిత తెలిపారు. తెలంగాణ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించారు.