»Pawan Kalyan Gave Key Instructions To The Janasena Activists Regarding Alliance With Tdp
Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై కార్యకర్తలకు జనసేనాని సూచన
పొత్తుల విషయంలో ఎవరు విద్వేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని జనసేన సైనికులకు సూచించారు అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీతో పొత్తు ఉంటుంది. దీన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు.
Pawan Kalyan gave key instructions to the Janasena activists regarding alliance with TDP
Pawan Kalyan: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం టీడీపీతో జనసేన పార్టీ పొత్తు కచ్చితం అని అధినేత పవన్ కల్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. దీనిపై జనసైనికులకు కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరు మాట్లాడవద్దని పేర్కొన్నారు. రాష్ట్రం కోసమే అందరం పాటుపడుతున్నది అని గుర్తు చేశారు. రా కదలిరా సభల్లో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
“జన హితం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్ట్యా.. ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే ఈ పొత్తుల ప్రస్తావన. ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు సాగుతున్న దశలో జనసేన పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారు.
దీనికి సంబంధించిన అభిప్రాయాలు, సలహాలు ఏవైనా సరే.. నా రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావొచ్చు. దాని ద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి ఉపయోగపడుతాయి. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై ప్రకటనలు చేసే నాయకులు తరువాత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. పొత్తుకు విఘాతం కలిగించే వారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.