PLD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై నరసరావుపేట కలెక్టరేట్లో ‘దిశ’ కమిటీ కీలక సమావేశం సోమవారం నిర్వహించింది. కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు,ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లాలోని అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.