MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు మూడేళ్లుగా ఆర్టీఎఫ్ (రీయింబర్స్మెంట్) ఫీజుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి వెంటనే స్కాలర్షిప్లు, కోర్సు ఫీజులను మంజూరు చేసి ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.