SKLM: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాను నిర్వహిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.