ATP: కంబదూరు మండలం రాళ్ల అనంతపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులను క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.