NGKL: మన్ననూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి చేయడంతో ఇవాళ రైతు చెన్నకృష్ణయ్యకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. సుమారు రూ.60 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పులి అడుగుజాడలను సేకరించారు. పులి సంచారంతో స్థానిక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.