KNR: శంకరపట్నం మండలం తాడికల్ చింతగుట్ట గ్రామాలలో సర్పంచులు దుర్గపు సుజాత, కర్క చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 288 పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. పాడి రైతు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని ఆయా గ్రామాల సర్పంచ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్, అమీర్ ఖాన్ పాల్గొన్నారు.