VZM: డెంకాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి, సంబంధిత డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.