MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట జీపీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తై బజార్, పశువుల సంత బహిరంగ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు పోటీ పడటంతో వాతావరణం హోరాహోరీగా మారింది. చివరకు గ్రామానికి చెందిన చిన్నారిపల్లి శాంత అత్యధికంగా రూ. 85,000 పాడుకుని ఈ వేలాన్ని దక్కించుకున్నారు.