MBNR: ముందస్తు ఆరోగ్య పరీక్షలతో మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని కుమ్మరివాడి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.