PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర నేటితో 10వ వారానికి చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఛైర్మన్ చిన తిరుపతి, ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేట్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.