NLR: నెల్లూరు నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ మంగళవారం నుంచి ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమావేశానికి కౌన్సిల్ మీటింగ్ హాల్ సిద్ధమైంది. ఈసారి రూ.473.31 కోట్ల బడ్జెట్ పద్దును మేయర్ కౌన్సిల్ సభ్యులు ముందు ఉంచనున్నారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులను నిలదీసేందుకు సభ్యులు సిద్ధమౌతున్నారు.