NLG: రహదారి భద్రతలో భాగంగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో భారీ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. డ్రైవర్ల కంటి చూపు సక్రమంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు.