KDP: జిల్లాలో పోలీస్ శాఖకు మీరు చేసిన సేవలు చిరస్మరణీయమని ASP ప్రకాష్ బాబు కొనియాడారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవి విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖ అంటే ఎంతో కష్టతరమైనదని, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. పదవి విరమణ తర్వాత నైనా కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలని సూచించారు.