KMR: బీర్కూర్ మండలం 13 రేషన్ షాపుల పరిధిలో ఏప్రిల్ 1 నుంచి 3 నెలల (ఏప్రిల్, మే, జూన్) రేషన్ పంపిణీ చెయ్యనున్నట్లు బీర్కూర్ తహసీల్దార్ సవాయిసింగ్ తెలిపారు. అలాగే అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున చక్కెర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని రేషన్ లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు.