ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో కొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్ను రూ. 3 వేలకు, డొమెస్టిక్ సిలిండర్ను రూ. 2 వేలకు అమ్ముతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. 20 రోజుల క్రితం బుక్ చేసుకున్నా రెస్పాన్స్ లేదని, సివిల్ సప్లై అధికారుల అండతోనే బ్లాక్ దందా సాఫీగా సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు.