NZB: కమ్మర్పల్లి మండల వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత అర్థరాత్రి కూడా ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, చింత, వరి పంటలు నేలరాలాయి. అకాల వర్షానికి రైతులు శ్రమించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యం కారణంగా నీటిపాలైంది. భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తం కలిసి రైతులకు కోలుకోలేని విధంగా నష్టాన్ని కలిగించింది.