MBNR: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాముఖ సాహితివేత్త కవి కపిలవాయి లింగమూర్తి బల్మూర్ మండలం జమ్మికుంటలో 1928 మార్చి 31న జన్మించారు. ఆయన 14 సంవత్సరాల వయసులోనే అనేక రచనలు ప్రారంభించి, పాలమూరు జిల్లా దేవాలయాలు, ఆర్యా శతకం, మహా క్షేత్రం మామిళ్ళపల్లి చరిత్ర సాలగ్రామశాస్త్రం, జానపద సాహిత్యం వంటి పలు ప్రక్రియల్లో 80కి పైగా గ్రంథాలు రచించారు.