ASR: గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 3,426 పీఎం జన్మన్ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. పూర్తి అన్ని మౌలిక వసతుల సదుపాయంతో 1,385 గృహాలను జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం గృహప్రవేశాలు జరిగాయన్నారు.