ASF: కాగజ్ నగర్ ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. NTR చౌరస్తాలో దాడులు నిర్వహించి నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. అతడి వద్ద నుంచి రూ.3.05 లక్షల నగదు, 2 ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.