నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారాక క్రమం తప్పకుండా పిల్లల తలకు పట్టించాలి. ఐరన్, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. గాఢత గల షాంపూలు, అతిగా తలస్నానం చేయించడం తగ్గించాలి. బాదం నూనె, ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకుని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు బాగా మర్దన చేసి ఉదయం తలస్నానం చేయించాలి.