‘ధురంధర్-2’లో శివ్ కుమార్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయని RGV అన్నాడు. ముఖ్యంగా రెట్రో హిందీ పాటలను యాక్షన్ సీన్స్‌లో వాడటం సినిమాకు కొత్త మూడ్ ఇచ్చిందని చెప్పాడు. సైనీ జోహ్రే ప్రొడక్షన్ డిజైన్ పాకిస్తాన్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని, సౌండ్ డిజైన్‌లో వాడిన ‘నిశ్శబ్దం’ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిందన్నాడు.