శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారింభించి 22 రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించింది. మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2.65 లక్షల కోట్ల నుంచి 2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా శాఖలకు ఈ ఏడాది బడ్జెట్ ఏ మేరకు అవసరం అవుతుందనే అంచనాలు వేసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు అంచనాలు రూపొందించుకోవాలని సర్కార్ అనుకుంటుంది . ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు అవసరమైన మేరకే.. నిధులను కోరాల్సిందిగా సూచిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తుంది.