ప్రకాశం: గిద్దలూరు మండలం దిగోమెట్ట అటవీ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.