SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం డిప్యూటీ ఈవోగా భాస్కర్ శర్మ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం డిప్యూటీ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను రాజన్న ఆలయానికి బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.