E.G: రాష్ట్రంలో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై గోకవరం స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బత్తిన రామకృష్ణ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు వాడే ‘డైక్లోఫినాక్’ వంటి మందుల ప్రభావం వల్ల ఇవి మృత్యువాత పడుతున్నాయని పేర్కొన్నారు. మృతకళేబరాలను తింటూ ప్రకృతిని శుభ్రపరిచే రాబందుల జాతిని కాపాడుకోవడానికి ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.