AKP: గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారుల నియామకానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డీపీఓ సందీప్ జిల్లాలో 646 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకానికి జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. మండల స్థాయిలో గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు.