BDK: ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025-26 పధకాల నమోదుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 8వ తేది వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా విభాగానికి సంబంధించి EV 2,3 వీలర్, గూడ్స్ ప్యాసింజర్, పశుసంవర్ధక రంగంలో పాడి పశువులు, సోలార్ పంప్ సెట్ వంటి పధకాలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.