SRPT: ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘సెన్సస్-2027’ సన్నాహకాల్లో భాగంగా, సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనాభా లెక్కల ప్రక్రియ, సిబ్బందికి శిక్షణ, డేటా సేకరణ అంశాలపై ఆమె కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు.