MNCL: జైపూర్ మండలం టేకుమట్ల IKP కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈసారి పంట దిగుబడి ఎక్కువ వచ్చిందని, గత పంటలో లక్ష పది వేల టన్నుల కొనుగోళ్లు జరిపితే ఈసారి లక్ష 70 వేల టన్నులు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఎవరు అదైర్యపడవద్దని,చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.