MDK: కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రసిద్ధ మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 9,80,780 వచ్చినట్లు ఈవో స్నేహలత తెలిపారు. సోమవారం భద్రత మధ్య గత 60 రోజుల హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్, ఆలయ ట్రస్టీ శిరోలి తదితరులు పాల్గొని పారదర్శకంగా లెక్కింపు పూర్తి చేశారు.