HNK: హన్మకొండ నగరంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 142/2022 నమోదైన పాక్సో కేసులో సోమవారం న్యాయమూర్తి అపర్ణ దేవి నిందితుడు వల్లేపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేయడంతో బాధితురాలికి న్యాయం జరిగిందని ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు.