VZM: బొబ్బిలి పట్టణంలో పేదల గృహ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. గొల్లపల్లి ప్రాంతంలో నూతనగా నిర్మించిన ఇళ్లలో గృహప్రవేశం నిర్వహిస్తూ, అర్హులైన వారికి పక్కా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని చెప్పారు. మున్సిపాలిటీలో వందలాది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.