»If You Dont Want To Be With That Heroine You Dont Want To Allu Arjuns Wifes Condition
Allu Sneha:ఆ హీరోయిన్‌తో వద్దంటే వద్దు.. అల్లు అర్జున్‌కు భార్య కండీషన్?
సోషల్ మీడియా వచ్చాక స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఏదైనా పుకారు వస్తే చాలు.. క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంటాయి. లేటెస్ట్గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ హీరోయిన్‌తో నటించొద్దని కండీషన్ పెట్టిందనే రూమర్ వైరల్‌గా మారింది.
If you don't want to be with that heroine, you don't want to.. Allu Arjun's wife's condition?
Allu Sneha: ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప2. అల్లు అర్జున్, కేశవ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పార్ట్ 1ని రీజనల్ లెవల్లో తెరకెక్కించి పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్.. ఈసారి పాన్ ఇండియా టార్గెట్‌గా ఇంటర్నేషనల్ లెవల్లో సినిమా చేస్తున్నాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ 1కు డబుల్ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో పుష్ప సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. ఆగష్టు 15న వెయ్యికోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు పుష్పరాజ్. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పుష్ప2 తర్వాత సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్‌తో సినిమాలు అనౌన్స్ చేశాడు బన్నీ. అయితే.. త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా హాట్ తృప్తి డిమ్రి పేరు వినిపిస్తోంది. లేదంటే, సందీప్ రెడ్డి సినిమాలో అయినా నటించే ఛాన్స్ ఉంది.
అనిమల్ సినిమాలో బోల్డ్‌గా కనిపించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది తృప్తి. ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా ఉంది తృప్తి. దీంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం తృప్తి లైన్లోకి వచ్చింది. కానీ తృప్తితో అల్లు అర్జున్ నటించొద్దని ఆయన భార్య స్నేహారెడ్డి కండిషన్ పెట్టినట్లుగా ఫిల్మ్ నగర్లో గుసగుసలాడుకుంటున్నారు. అనిమల్ సినిమాలో తృప్తి బోల్డ్ సన్నివేశాలు చూసిన తర్వాత స్నేహ ఈ నిర్ణయం తీసుకుందని చెవులు కొరుక్కుంటున్నారు. అసలు ఇందులో నిజమెంత? ఇలాంటి పుకార్లు ఎలా పుడుతున్నాయి? అనేది తెలియదు గానీ, స్నేహా రెడ్డి మాత్రం బన్నీకి కండీషన్ పెట్టడం అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. బన్నీతో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశాడు కానీ, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం. మధ్యలో మాంత్రికుడు న్యాచురల్ నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. సందీప్ రెడ్డి అనిమల్ పార్క్, స్పిరిట్ చేస్తున్నాడు. కాబట్టి.. స్నేహారెడ్డి బన్నీకి కండీషన్ అనేది ప్రస్తుతానికి కేవలం పుకారు అని మాత్రమే చెప్పాలి.