KNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ.. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాలు వేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కీర్తన, డా. రమణారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.