కోనసీమ: రావులపాలెం వైసీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగడం వ్యర్థమని వ్యాఖ్యానించారు.