WGL: సోషల్ మీడియా వచ్చాక మేలు కంటే ఎక్కువ కీడు జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిన్న తాను రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణ వేస్తే దానిపై కూడా నేడు ట్రోలింగ్ స్టార్ట్ చేశారని అన్నారు. మహిళల పట్ల కూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారని, అసభ్యకరమైన పోస్టులను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.