HNK: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. పెద్దాపురం గ్రామానికి చెందిన యశ్వంత్ శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్కు ఎంపికైన నేపథ్యంలో ఆయనను పగడాల సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి పెద్దాపురం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.