TG: అసెంబ్లీలో నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్ సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంత్రి పొంగులేటి అక్రమాలకు పాల్పడుతున్నారని.. అతణ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతి చేస్తున్నారని వివరించామన్నారు. ప్రజాసంపద దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.