MBNR: జడ్చర్లకు చెందిన సరోజ ఇద్దరు పిల్లలతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కన్నీళ్లు పెట్టి ఫిర్యాదు చేశారు. భర్త మృతి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆమె, బిడ్డలకు హాస్టల్లో చదువుకునే అవకాశం, తనకు అక్కడే ఏదైనా పని కల్పించమని కోరారు. ఆమె బాధను వినిపించడంతో అధికారులు సహాయం కోసం చర్యలు తీసుకుంటున్నారు.