ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.