E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలిపిన మిశ్రమం. ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్. దీనిని ప్రధానంగా చెరకు పిప్పి, పాడైపోయిన ధాన్యం (వరి, మొక్కజొన్న) నుంచి తయారు చేస్తారు. పెట్రోల్‌తో పోలిస్తే E20 పెట్రోల్‌తో కాలుష్యం తగ్గుతుంది. అలాగే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించడానికి కేంద్రం E20 వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.