SDPT: నెంటూర్లో ఏప్రిల్ 2న నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర వాల్ పోస్టర్లను ధర్మ రక్షా కమిటీ సభ్యులు ఆదివారం విడుదల చేశారు. బజరంగ్ దళ్ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో ఈ భారీ శోభాయాత్ర జరగనుంది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.